కోదాడలోని తేజ ఫార్మసీ కళాశాలలో శనివారం ఫార్మసీ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు హాజరయ్యారు. ఫార్మా రంగంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, విద్యార్థులు తమ సబ్జెక్టులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తేజ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థులు అనేక ఫార్మా కంపెనీలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ప్రస్తుత విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, 35 ఏళ్లుగా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యనందిస్తున్న పందిరి నాగిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.