గురువారం మండల కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విజయ్ కుమార్, మహేష్, నాగరాజు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.