కోదాడలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా, వైద్యులు డా. జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ, మనుషులకు ఉన్నట్లే పక్షులు, జంతువులకు కూడా భూమిపై జీవించే హక్కు ఉందని, వాటి ఆవాసాలను ధ్వంసం చేయకుండా పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 'వన్యప్రాణులను రక్షించండి' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం, పెన్షనర్స్ సంఘం ప్రతినిధులు, పలువురు కవులు పాల్గొన్నారు.