శాలిగౌరారం: భార్య మృతి తట్టుకోలేక భర్త హఠాన్మరణం

0చూసినవారు
శాలిగౌరారం: భార్య మృతి తట్టుకోలేక భర్త హఠాన్మరణం
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవరం (కలాన్) గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మామిడి ముత్తమ్మ (73) శనివారం ఉదయం 6 గంటలకు మృతి చెందింది. భార్య మరణ వార్తను తట్టుకోలేకపోయిన భర్త మామిడి సైదులు (79) సుమారు 5 గంటల వ్యవధిలోనే, అంటే ఉదయం 11 గంటల సమయంలో కుప్పకూలి మరణించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడిని పిలిపించగా, ఆయన కూడా మరణించినట్లు ధృవీకరించారు. భార్యాభర్తల మధ్య ఉన్న గాఢమైన ప్రేమకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.