శాలిగౌరారం: పోలీసుల పైశాచికత్వం.. బాధితుడు పై థర్డ్ డిగ్రీ

0చూసినవారు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు బాధితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిత్తలూరు గ్రామంలో గోడ నిర్మాణ వివాదంలో భాగంగా ఉపసర్పంచ్ ప్రోద్బలంతో ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు సురేష్‌పై దాడి చేశారని బాధితుడి భార్య జ్యోతి ఆరోపించారు. ఎస్సై కాళ్లపై పడి వేడుకున్నా కనికరించలేదని, చెవిలో నుంచి రక్తస్రావం అవుతోందని, పోలీసుల కొట్టలేదని జడ్జికి చెప్పాలని బెదిరించారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :