శాలిగౌరారం:: గర్భిణీ, బాలెంతలు పౌష్టికాహారం తీసుకోవాలి

2చూసినవారు
శాలిగౌరారం:: గర్భిణీ, బాలెంతలు పౌష్టికాహారం తీసుకోవాలి
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సర్పంచ్ నూక నాగలక్ష్మి-జానయ్య, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. పెర్కకొండారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహారంతోనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ నాగలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెరుమాండ్ల సునీత, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడి టీచర్స్ సిహెచ్ మంగమ్మ, జె. సరిత, బి. యల్లమ్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్