సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. అభ్యర్థులు ప్రచారానికి అనుమతులు తీసుకోవాలని, కాంప్లికేటెడ్ వ్యక్తులను రూ. 5 లక్షల కింద బైండోవర్ చేశామని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.