తిరుమలగిరి: పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పోరెల్లా దాసు

0చూసినవారు
తిరుమలగిరి: పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పోరెల్లా దాసు
తొండ తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో కామ్రేడ్ పోరెల్ల దాసు 8వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పోరెల్ల చిత్రపటానికి పలువురు పుష్ప గుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. సీపీయం మండల కార్యదర్శి గుమ్మడి వెల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, 1946-1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పోరెల్ల దాసు ప్రాణాలకు తెగించి, తన యవ్వన జీవితాన్ని పేదల కోసం ధారపోసిన ధీశాలి అని కొనియాడారు. సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతంలో దొరలు, పెత్తందారులు, నైజాం రజాకార్లు, యునియన్ సైన్యాల దోపిడీ, భూస్వామ్య గూండాల అరాచకాలను ఆయన ఎదిరించి పోరాడారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్