సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో మర్రి యాదవ రెడ్డి మాతృమూర్తి మర్రి వెంకటమ్మ ఇటీవల మరణించారు. మంగళవారం వారి నివాసానికి సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లి మర్రి వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు కడారి స్టాలిన్ యాదవ్ గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించారు.