సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే మందుల సామేలు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణం అంచనా విలువ రూ. 15 లక్షలతో నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేషిడి కవిత వెంకటలక్ష్మి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ నాయకులు పాల్గొన్నారు.