తిరుమలగిరి పురపాలిక పాలకవర్గం 2026-27 సంవత్సరానికి రూ. 29.20 కోట్ల బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. శనివారం పురపాలిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైర్మన్ సంకేపల్లి రఘునందన్రెడ్డి అధ్యక్షతన అంచనా ఖర్చులను కూడా అంతే మొత్తంగా నిర్ణయించారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో పురకమిషనర్ ఎం. రాంచంద్రరావు, వైసఛైర్పర్సన్ గోవిందమ్మ, తహసీల్దార్ బి. హరిప్రసాద్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.