తెలంగాణలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకోసం పేదలకు రేషన్ కార్డు ఓ ఆయుధంగా ఉపయోగపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఏ ఒక్క పేద కుటుంబానికీ రేషన్ కార్డు ఇవ్వలేని దద్దమ్మలు నేడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.