సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్‌కు చెందిన 69 మంది పూర్వ విద్యార్థులు 40 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ కలయికలో వారు తమ అనుభూతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి.