సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లోని పాఠశాలల్లోనే గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి బందోబస్తుతో, పోలీసు పహారాలో జరుగుతుందని సర్కిల్ సిఐ నరసింహారావు తెలిపారు. ఎన్నికల నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో శాంతిభద్రతలను కాపాడటంపై అధికారులు దృష్టి సారించారు.