తుంగతుర్తి: ధాన్యం కాంటాలు కావడం లేదు.. రైతుల ఆవేదన

0చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఎక్స్ రోడ్డు తండాలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తమ ధాన్యం కాంటాలు వెంటనే పెట్టాలని స్థానిక రైతు గుగులోతు పూల ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 రోజులుగా కాంటాలు పెట్టడం లేదని, ఐకెపి నిర్వాహకులు లారీలు రావడం లేదని సాకులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇలాగే కొనసాగితే మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్