తుంగతుర్తి: ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాకే ఇవ్వాలి

0చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గానుగుబండ గ్రామస్థులు అధికారుల అలసత్వంపై ఆరోపణలు చేశారు. గతంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించిన వారిపై అవినీతి ఆరోపణలు రావడంతో, ఇతర సంఘాలు బాధ్యతలు కోరాయి. అధికారులు మాత్రం పాతవారికే అప్పగిస్తామని చెప్పడంతో గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాదని, ఇతర సంఘాల వారికి సోమవారం కేంద్రాన్ని ప్రారంభించే బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్