మంత్రివర్గంలో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించిన సందర్భంగా బుధవారం తుంగతుర్తిలో యువజన కాంగ్రెస్ నాయకులు కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ పాల్గొన్నారు.