తుంగతుర్తి: సంగెం వాగు ఉధృతి.. రైతులు, కూలీలు ఇబ్బందులు

4చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో తిమ్మాపురం అన్నారం ప్రధాన రహదారిపై ఉన్న వాగు గత నాలుగు నెలలుగా ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పొలాలకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్