సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన కౌలు రైతు షేక్ జానీ, తాను కౌలుకు తీసుకున్న పది ఎకరాల పంట భారీ వర్షాలకు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టినప్పటికీ, చేతికి వచ్చిన పంట నేలపాలైందని, అప్పులు చేసి సాగు చేశామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన వేడుకుంటున్నారు.