సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటిలో శుక్రవారం ఉదయం మనస్తాపానికి గురైన రమణబోయిన సోమనర్సమ్మ(50) బలవన్మరణానికి పాల్పడింది. అక్టోబరు 24న గ్రామంలో జరిగిన బంగారం, వెండి దొంగతనం కేసులో తనపై అనుమానం ఉందని తెలుసుకున్న ఆమె, అక్టోబర్ 25న ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చినప్పటికీ, తీవ్ర మనస్తాపంతో సోమనర్సమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తుంగతుర్తి సీఐ నర్సింహారావు విచారణ చేపట్టారు.