
విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
AP: విశాఖపట్నంలో చెవి నొప్పికి చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 13 ఏళ్ల యజ్ఞశ్రీ అనే బాలిక మృతి చెందింది. వైద్యులు శస్త్రచికిత్సకు ముందు ఓవర్ డోస్ మందులు ఇవ్వడం వల్లే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం కొంతసేపు విషయాన్ని దాచిపెట్టిందని కూడా ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.




