ఝార్ఖండ్ రాజధాని
రాంచీలోని ఇస్లామ్‌నగర్‌లో ఢిల్లీ స్పెషల్ సెల్, ఝార్ఖండ్ ఏటీఎస్ కలిసి అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అజర్ డానిష్‌ను అరెస్ట్ చేశారు. అతడి పేరిట ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ అయింది. రాంచీలోని టబారక్ లాడ్జ్‌లో అతడు ఉన్న గదిలోని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. డానిష్‌తో పాటు మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండ్ నిమిత్తం ఢిల్లీకి తరలిస్తున్నారు.