బీహార్ ఎన్నికల అనంతరం మాజీ కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో BJP నిన్న (శనివారం) సస్పెండ్ చేసింది. అయితే తన వద్ద స్పష్టమైన ఆరోపణలు లేవని, షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వలేనని పేర్కొంటూ ఆర్‌కే సింగ్ ఈ రోజు ఉదయం (ఆదివారం) జేపీ నడ్డాకు రాజీనామా లేఖను పంపించారు. నేర కేసులు ఉన్న వారికి టికెట్లు ఇవ్వకూడదని చేసిన వ్యాఖ్యలే చర్యకు కారణమై ఉండవచ్చని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో సింగ్ పార్టీ నేతలను విమర్శించి, రూ.62,000 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు.