TG: హైదరాబాద్ మధురానగర్లో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. కృష్ణానగర్ ఏ బ్లాక్లో డాకూరి కవిత(39) చనిపోయారు. కవిత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కవితను భర్త, అత్తమామలు విషం ఇచ్చి చంపినట్లు కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.