వివాహిత అనుమానాస్పద మృతి.. అత్తింటివారిపై కేసు

78చూసినవారు
వివాహిత అనుమానాస్పద మృతి.. అత్తింటివారిపై కేసు
AP: చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన మనోజ్ఞ(26) కర్ణాటకలోని ముళబాగిలులో అత్తింట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆరేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బంగారం, నగదు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మంగళవారం మనోజ్ఞ ఉరేసుకున్నట్లు సమాచారం. ఆమెను అత్తింటివారే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్