OYO హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

2చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లోని గోకుల్ ప్రైడ్‌లో సీ గణేశ్ పేరుతో రూమ్ నంబర్ 103 తీసుకున్న యువతి తెల్లారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆధార్ కార్డులో యువతి పేరు దుర్గగా గుర్తించగా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు శిరీష అని ఉందని తెలిసింది. భర్త కొట్టడం వల్లే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్