TG: వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ పెండ్యాల సుచరిత (36) అనుమానాస్పదంగా మృతి చెందింది. మానవ అక్రమ రవాణా కేసులో ఆగస్టు 13న రిమాండ్‌పై జైలుకు వచ్చిన ఆమె బుధవారం కడుపునొప్పితో ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. గురువారం వాంతులు, విరేచనాలతో మళ్లీ అస్వస్థతకు గురై ఆస్పత్రి చేరేలోపే మృతిచెందింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.