
అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో హిందువును కొట్టి చంపారు. 'ఘాజీపూర్‌లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని మాసుమ్ ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం' అని పోలీసులు తెలిపారు.




