విషాదం.. తల్లీ కూతుళ్ల అనుమానాస్పద మృతి

34చూసినవారు
విషాదం.. తల్లీ కూతుళ్ల అనుమానాస్పద మృతి
AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. దూబచర్ల- చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీకూతుళ్లుగా వీరిని గుర్తించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు సమాచారం. ఇది హత్యేనా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.