భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి చంపిన భర్త

48577చూసినవారు
భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి చంపిన భర్త
AP: అనంతపురం (D), డి.హీరేహళ్‌ (M), మురడిలో దారుణ ఘటన జరిగింది. హనుమంతరాయుడు అనే వ్యక్తి తన భార్య నాగవేణి(35)ని అనుమానంతో గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం జరగ్గా ఇవాళ వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల నుంచి హనుమంతరాయుడు మానసికంగా బాధపడేవాడని, ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని సమాచారం. ఎస్సై గురు ప్రసాద్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్