
జగన్ హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు: మంత్రి నిమ్మల
AP: కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవా ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయలసీమ బిడ్డ అని చెప్పినా, హంద్రీనీవాకు ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని మంత్రి మండిపడ్డారు. మోటార్ల బిల్లులు చెల్లించకపోవడం, తట్టమట్టిని లేకపోవడం వంటి లోపాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రూ.3850 కోట్లు ఖర్చు పెట్టి 738 కిమీ ప్రాంతానికి కృష్ణా జలాలను అందించిందని తెలిపారు.




