12.89 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు లేవు: సిపెక్ సర్వే

4413చూసినవారు
12.89 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు లేవు: సిపెక్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలు నీరుగారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా 12,89,289 కుటుంబాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని సిపెక్ సర్వే వెల్లడిస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సర్వే వెల్లడించింది. గతంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం, నిధుల వినియోగంలో జాప్యం, రికార్డుల మ్యాపింగ్‌లో ఆలస్యం వంటి కారణాలతో లక్ష్యాలు నెరవేరడం లేదని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్