బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా

42చూసినవారు
బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా
AP: ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొండూరు గ్రామానికి చెందిన లక్ష్మణరావు, అనూష దంపతులు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు దినకరన్ స్నేహితులతో కలిసి కూచి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. దినకరన్ వాగు గుంతలో మునగడాన్ని స్నేహితులు గమనించి కేకలు వేశారు. స్థానికుల దినకరన్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్