
నేడు దేవరపల్లిలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్
AP: తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, పంట సాగులో ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్ల పరిస్థితి వంటి అంశాలపై చర్చించనున్నారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారు.




