'టీ-షర్ట్'కి ఆ పేరు ఎలా వచ్చిందబ్బా..?

16592చూసినవారు
'టీ-షర్ట్'కి ఆ పేరు ఎలా వచ్చిందబ్బా..?
నేడు ప్రతి ఒక్కరి రోజువారీ ఫ్యాషన్‌లో టీ-షర్ట్ ఒక ముఖ్య భాగం. దీనికి 'టీ-షర్ట్' అనే పేరు రావడానికి రెండు ప్రధాన సిద్ధాంతాలున్నాయి. మొదటిది, షర్ట్‌ని నేలపై పరచినప్పుడు దాని 'T' ఆకారం. రెండవది, మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు శిక్షణ సమయంలో ధరించే 'ట్రైనింగ్ షర్ట్' సంక్షిప్తీకరణ టీ-షర్ట్. 1950లలో మార్లోన్ బ్రాండో, జేమ్స్ డీన్ వంటి నటులు సినిమాల్లో టీ-షర్ట్ ధరించడంతో ఇది యువతలో తిరుగుబాటు, పురుషత్వానికి చిహ్నంగా మారింది. నిపుణులు మాత్రం ఆకారాన్ని బట్టే పేరు వచ్చిందనే వాదనను బలంగా సమర్థిస్తారు.
Job Suitcase

Jobs near you