ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన సౌతాఫ్రికా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.