దేశ రాజధాని ఢిల్లీలోని సదర్ బజార్‌లో సెప్టెంబర్ 16న రాత్రి దారుణం జరిగింది. ఆరో తరగతి చదివే బాలికను టైలర్ మక్సూద్ తన షాపులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. షాపు నుంచి ఇంటికి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మక్సూద్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.