
ఒకే ఒక్క ఓటుతో ఓటమి పాలైన మంత్రి పెరియకరుప్పన్
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సహకార శాఖ మంత్రి కె.ఆర్. పెరియకరుప్పన్ ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. శ్రీనివాస్ 83,375 ఓట్లు సాధించగా, పెరియకరుప్పన్కు 83,374 ఓట్లు వచ్చాయి. పెరియకరుప్పన్ అభ్యర్థన మేరకు అధికారులు రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ, శ్రీనివాస్ విజయం ఖరారైంది.




