ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో తలసాని శ్రీనివాస్ యాదవ్

6287చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ నుండి హుస్సేన్ సాగర్ తీరం వరకు పంచ ముఖ సంకట హర మహా గణపతిని ఊరేగించారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద వాహనం ఎక్కి శోభాయాత్రలో పాల్గొన్న తలసాని, వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. అందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్