ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనలో ప్రభుత్వ అధికారులకు స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఈ ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి జనరల్ స్టాఫ్ వరకు వర్తిస్తాయి, సుప్రీం లీడర్‌కు మాత్రమే మినహాయింపు. ఫోన్లు వాడటం వల్ల కీలక డాక్యుమెంట్లు లీక్ కావడం, ఉత్పత్తి తగ్గడం, పనులు మందగించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫోన్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వందలాది ఫోన్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.