పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వివాదాస్పద ‘డ్యూరాండ్ లైన్’ వద్ద పాక్ అధీనంలో ఉన్న షొరబాక్ ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సైనికులు మరణించగా, వారి ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఔట్‌పోస్ట్‌ను తగలబెట్టారు. ఈ ఘర్షణల కారణంగా ఇరు దేశాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.