
WTCలో గిల్ కొత్త రికార్డు
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 71 ఇన్నింగ్స్‌లలో 2,732 పరుగులు చేసిన గిల్ రిషబ్ పంత్‌ను అధిగమించాడు. అలాగే కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు కూడా గిల్ పూర్తి చేసుకున్నాడు.




