తెలంగాణలో కొన్ని రోజులుగా కొనసాగిన ఉన్నత విద్యాసంస్థల బంద్ సమస్యకు తెరపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగినప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. దీంతో కాలేజీల బంద్ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే రూ.600 కోట్లు.. త్వరలో మరో రూ.300 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ నెల 3వ తేదీ నుంచి బంద్‌లో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కళాశాలలు తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.