
హెలి రంగులు పోగొట్టే చిట్కాలివే
హోలీ తర్వాత చర్మం, గోళ్లు, జుట్టుపై అంటిన రంగులను తొలగించడానికి కొన్ని సులభమైన చిట్కాలను నిపుణులు వివరిస్తున్నారు. రంగులు పడగానే నీళ్లతో కడిగేయకుండా, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ రాసి మసాజ్ చేయాలి. మొండి రంగుల కోసం సబ్బుకు బదులుగా శనగపిండి, పెరుగు, నిమ్మరసంతో చేసిన ఉబ్టాన్ వాడాలి. గోళ్లలోకి చేరిన రంగుల కోసం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిలో వేళ్లను నానబెట్టడం మంచిది. ముఖంపై రంగుల కోసం క్లెన్సింగ్ మిల్క్, కొబ్బరి నూనె వాడాలి. జుట్టుకు అంటిన రంగులను తొలగించడానికి వెంటనే షాంపూ చేయకుండా, మామూలు నీటితో కడిగి, మైల్డ్ షాంపూ, కండీషనర్ వాడాలి. వేడి నీళ్లకు బదులుగా చల్లని, మామూలు నీటినే ఉపయోగించాలి.




