టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (హెచ్‌పీఎల్)లో 'ది రాప్టర్స్' టీమ్‌కు కో-ఓనర్‌గా చేరారు. ఆర్బిట్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ కో -ఫౌండర్స్ కౌశిక్ మానేపల్లి, దివ్య ప్రియాంక రెడ్డితో కలిసి ఆయన యాజమాన్య బృందంలో భాగమయ్యారు. ఇండియాలోనే తొలి ప్రొఫెషనల్ హైపర్ లోకల్ పికల్‌బాల్ లీగ్ అయిన హెచ్‌పీఎల్‌లో పోటీపడుతున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో 'ది రాప్టర్స్' ఒకటి.