
తాతయ్య కోసం AI యాప్.. చైనా కుర్రాడి అద్భుత ఆవిష్కరణ
చైనాలోని షాంఘైకి చెందిన 18 ఏళ్ల మా కై అనే విద్యార్థి, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న తన 70 ఏళ్ల తాతయ్య కోసం AI సహాయంతో ఒక అద్భుతమైన యాప్ను రూపొందించాడు. ఈ యాప్ తాతయ్యకు సమయానికి మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, మందుల గడువు ముగిసిపోయిందో లేదో కూడా తెలియజేస్తుంది. వరల్డ్ AI కాన్ఫరెన్స్లో నిపుణుల సహాయంతో అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. తాతయ్య ఆరోగ్యంపై ఉన్న ప్రేమతో చేసిన ఈ పనికి మా కై ప్రశంసలు అందుకుంటున్నాడు.




