ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడులోని రాణిపేట జిల్లా పాణపక్కంలో కొత్త తయారీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే 5-7 ఏళ్లలో ఈ ప్లాంట్ ద్వారా 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఈ ప్లాంట్‌పై రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.