
బాలికపై యువకుడు లైంగిక దాడి
TG: హైదరాబాద్ కాచిగూడ పరిధిలో బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి పక్కింటి యువకుడు మాయమాటలు చెప్పి లోబర్చుకుని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.




