పీఎఫ్ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా?

15153చూసినవారు
పీఎఫ్ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా?
పీఎఫ్ (PF) డబ్బును ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం ముఖ్యమైన పొదుపుగా భావిస్తారు. అయితే, పీఎఫ్ మొత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రా చేసుకుంటే పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఒకే సంస్థలో లేదా వేర్వేరు సంస్థల్లో కలిపి ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తి చేయకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, ఆ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ విత్‌డ్రా చేసినప్పుడు, పాన్ వివరాలు అందుబాటులో ఉంటే 10 శాతం టీడీఎస్ వర్తించే అవకాశం ఉంది. పాన్ ఇవ్వకపోతే ఎక్కువ రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది. సాధారణంగా ఐదేళ్లు ఉద్యోగం పూర్తయిన తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే పన్ను మినహాయింపు లభిస్తుంది.

సంబంధిత పోస్ట్