చైనాలో కండోమ్‌లపై పన్ను.. జనాభా పెంచే ప్రయత్నమా?

0చూసినవారు
చైనాలో కండోమ్‌లపై పన్ను.. జనాభా పెంచే ప్రయత్నమా?
చైనా ప్రభుత్వం జనవరి 1 నుంచి కండోమ్‌లు, గర్భనిరోధకాలపై 13% పన్ను విధిస్తోంది. దేశంలో తీవ్రమవుతున్న జనాభా సంక్షోభం, తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యువత వివాహం చేసుకుని, పిల్లలను కనేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పిల్లలను పెంచడం ఇప్పటికే చాలా ఖరీదైనదని, కండోమ్‌లపై పన్ను విధించడం అవాంఛిత గర్భధారణ, లైంగిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని మహిళలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిపుణులు దీనిని జనాభా పెంచడంతో పాటు ప్రభుత్వ ఖజానాను నింపే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్